శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని లావేర మండలం పాత కుంకం గ్రామానికి చెందిన బుడుమూరు శిరీష 22 అనే యువత మృతి. రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి పదిన్నర గంటలకు మృతి చెందింది. ఈమెకి ఇటీవల వివాహం జరిగింది. శ్రీకాకుళం నుంచి రణస్థలం వెళ్లేందుకుగాను ఆటోలో ప్రయాణిస్తుండగా స్థానిక లావేర్ జంక్షన్ వద్దకు రాగానే ఆటో క్రాస్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. రణస్థలం ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.