అదను వర్షాలు లేక పంటలు సక్రమంగా పండలేదని అర కొరగా చేతికొచ్చిన పంట నూర్పిడి చేసే సమయంలో చిరుజల్లులు కురుస్తుండడంతో ఆ పంట కూడా వర్షానికి తడిసి దెబ్బతింటుందని పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన రైతు వెంకట రాముడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి నుంచి బుక్కపట్నం వెళ్లే దారిలో వేరుశనగ మొక్కజొన్న పంటను ఆరబెట్టిన రైతు మాట్లాడుతూ విత్తన వేరుశనగ నాణ్యమైనవి పంపిణీ చేయలేదని, ఆ విత్తనాలతో పంట సాగు చేస్తే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దెబ్బతిందన్నారు.