అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కొరత ఏర్పడడంతో రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులతో క్యూ లైన్ పాటిస్తున్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు తక్షణమే యూరియ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.