ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల మయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బస్వాపురం గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన చేపట్టారు నిరసన కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు.