ఆళ్లగడ్డ పట్టణంలో స్త్రీ శక్తి కార్య క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం మహిళలతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ యార్డ్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఇచ్చిన మరో పెద్ద వరం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణమని ఎమ్మెల్యే తెలిపారు.