గుత్తి కోటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. 15 నెలల బాలుడు షర్విల్ రెడ్డి వేడిపాలు నోటిలో, ముక్కులో పడడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు షర్మిల్ రెడ్డి వేడి చేసిన పాలను తాగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు పాలు నోటిలో, ముక్కులో పడ్డాయి. ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో కూటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.పోలీసులు దర్యాప్తు చేపట్టారు.