దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను పాడేరులో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బిజెపి పార్టీ నేతలు దగ్ధం చేశారు. పాడేరు పాత బస్టాండ్ ఆవరణం అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగించారు.