తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లకు రక్షణ కరువైందని తెలంగాణ ఆప్ బేసిడ్ డ్రైవర్స్ ఫారం అధ్యక్షులు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉన్నది తార్నాక మెట్రో స్టేషన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సంతోష్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటనపై శనివారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్యాబ్ డ్రైవర్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాపిడో యాప్ యాజమాన్యం ఫిర్యాదు పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.