చేపల చెరువులో పని కోసం వెళ్లి, తప్పిపోయి జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్న గిరిజనుడిని తిరిగి ఇంటికి చేర్చేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ముందుకు రావడం అభినందనీయమని పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్వాసితుల సంఘం నాయకుడు కోరాడ ఈశ్వరరావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని పాచిపెంట మండలానికి చెందిన గత ఏడాది తప్పిపోయిన బడ్నాన చిన్నారావు తల్లి చిన్నమ్మి, తమ్ముడు జోగారావుతో కలిసి మాట్లాడారు. టంగుటూరులో చేపల చెరువులో పని కోసం వెళ్లిన చిన్నారావు జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల ద్వార తెలిసిందన్నారు.