రైతులు యూరియా కొరతతో అవస్థలు పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు పట్టడంలేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం టెక్కలిలో మీడియాతో మాట్లాడారు. పంటకు యూరియా వాడకూడదని WHO ఏమైనా చెప్పిందా అని ప్రశ్నించారు. రైతులకు అందాల్సిన యూరియా టీడీపీ నాయకులు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కూడా ఒత్తిడికి గురి అవుతున్నారన్నారు. కొందరు రైతులతో ఫోన్లో మాట్లాడారు.