తమిళ పోరాటాసి నెల ప్రారంభంతో తమిళనాడు నుండి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు 45 రోజులపాటు విడిది కేంద్రాన్ని చిత్తూరు నగరంలోని కటమంచి శాంతా రఘురామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నట్లు సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. భక్తులకు కావలసిన మూడు పూటలా ఆహారము, విశ్రాంతి గది, స్నానపు ఏర్పాట్లు, కనీస వసతులతో విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.