శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల ఏపీటీఎఫ్ నుతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా దస్తగిరి, అధ్యక్షుడిగా శివన్న, ప్రధాన కార్యదర్శిగా గణేశ్, జిల్లా కౌన్సిలర్లుగా జవాజీ నాగరాజు, చంద్ర, సంజీవరాయుడు, ప్రసాద్ నాయక్, ఆనంద్, ఇర్ఫాన్, రేష్మా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్ కుమార్, శ్రీనివాసులు, రంగేశ్ కుమార్, కాలయ్య పాల్గొన్నారు