విజయనగరం జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా SP వకుల్ జిందల్ ఆదివారం ఆదేశించారు. జిల్లా SP వకుల్ జిందల్, మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా SP ఆదేశించారు. పోలీసు స్టేషను పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు