వేంపల్లి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ ట్యాంక్ బజార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని మండపం వద్ద ఆదివారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనానికి ముందు లడ్డూ, కలశం, స్వామి వారి బొడ్డులోని రూపాయి కోసం ప్రత్యేకంగా వేలం ఏర్పాటు చేశారు. ఈ వేలం పాటలు హోరాహోరీగా జరిగాయి. కాగా లడ్డు వేలం పాటలో శ్రీరామ్ నగర్ ట్యాంక్ బజార్ కు చెందిన దెరంగుల విశ్వనాథ్ రూ. 93000 లకు గణేశుడి లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డు వేలం పాటలో లడ్డు దక్కించుకున్న దెరంగుల విశ్వనాథ్ ను వారి కుటుంబ సభ్యులను వారి ఇంటి వరకు డప్పు వాయిద్యాలతో తీసుకువెళ్లారు.