ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందులు దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేసిన మండల తహసీల్దారులు.. శనివారం భీమడోలు మండల అగ్రికల్చర్ ఏవో ఉషారాణి, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో తహసీల్దార్ రమాదేవి మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల షాపుల తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి, స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో ఎరువులు ధరలు, ఇబ్బందులు గురించి ముఖాముఖీ అయ్యారు. ఎరువులు, పురుగుమందులు కొరత రాకుండా డీలర్లు రైతులకు సహకరించాలని తహసీల్దార్ ఆదేశించారు.