శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో శనివారం మధ్యాహ్నం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హాజరయ్యారు. కళాశాల యాజమాన్యం జేసీకి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు.