ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. అనంతరం ఆయన వైసిపి ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ఆర్భాటంగా ప్రారంభించి నిర్మాణాలను గాలికి వదిలేసిందన్నారు. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీని పిపిపి మోడల్ లో నిర్మిస్తామన్నారు. మెడిసిన్ విద్యను ప్రభుత్వం ప్రవేట్ పరం చేస్తుందంటూ వైసిపి ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీ పూర్తి చేసి 2026-27 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తామన్నారు.