గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం ఆవల ఉన్న దిగవ కొండపర్తి గిరిజన గ్రామం లో ఎర్ర బోయిన కొత్తమ్మ అనే మహిళ పాము కాటు గురై మృతి చెందిందని, దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం గంట్యాడ ఎస్ ఐ సాయి కృష్ణ తెలిపారు. గుర్తు తెలియని పాము కొత్తమ్మను గురువారం కాటు వేయడంతో తాను నివసిస్తున్న పూరిగుడిసెలోనే మృతి చెందింది అన్నారు. దీనిపై శుక్రవారం అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కొత్తమ్మ మృతదేహానికి శుక్రవారం ఎస్ కోట ప్రభుత్వాసుపత్రిలో శవ పంచినామా నిర్వహించడం జరిగిందన్నారు.