కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 2025, 2026 విద్యా సంవత్సరానికి జిఎన్ఎం నర్సింగ్ కోర్సులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో 22వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారన్నారు.