జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో సచివాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళలు శనివారం రాత్రి రహదారిపై ధర్నాకు దిగారు. గ్రామ సచివాలయం ఎదురుగా బెల్ట్ షాపు ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి దూరంగా ఉండాల్సిన మద్యం దుకాణాలు సచివాలయాలు, దేవాలయాలు, పాఠశాలలకు దగ్గరలో ఏర్పాటు చేయడం సరికాదని మహిళా లు తెలిపారు.