కైకలూరు మండలం కైకలూరులో శనివారం శ్రీవాసవి ఆక్వా రైతుబజారు,ఏ టు జెడ్ ఆక్వా బజారు మరియు ఏ టు జెడ్ ఆక్వా గోడౌన్ ను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టాకు రిజిస్టర్లను,స్టాకుగోడౌన్ ను పరిశీలించి స్టాకు రిజిస్టరు ప్రకారం సరుకును పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై ముఖ్యంగా యూరియా సరఫరాపై ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని,అలాగే రైతులకు నానో యూరియా మరియు నానో డిఏపి గురించి రైతులకు అవగాహన కల్పించి వారితో వినియోగించాలని తెలిపారు.