గడ్డి అన్నారం డివిజన్లో భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో భజన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దం ప్రేమకేశ్వర్ రెడ్డి ఆదివారం ఉదయం పాల్గొని భజన గాయకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తి భావన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. భజనల ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని తెలిపారు.