జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న గణనాథని వద్ద ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డుకు శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాట లో వెల్గొండ గ్రామానికీ చెందిన కనపర్తి రమణా రావు రూ. 2,50,000 కు లడ్డు ను దక్కించుకున్నారు. రమణా రావు దంపతులు, కుటుంబ సభ్యులను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనలు తెలుపుతూ లడ్డును అందజేసి శాలువాతో సన్మానించారు.