తన భార్య తల్లిని దారుణంగా హత్య చేసిన ఒక వ్యక్తికి నగర మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి వి. శ్రీనివాసరావు సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు లక్షా ఇరవై వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఇందులో లక్ష రూపాయలు బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. ఖజానారావు తెలిపిన వివరాల ప్రకారం... ఆరిలోవలోని లక్ష్మిపార్వతి నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ వి. మహేష్, అదే ప్రాంతానికి చెందిన ఎర్రంశెట్టి కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.