రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెరతీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో జగన్నాటకానికి తెర తీశాడన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం జగన్ దన్నారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని, తన నివాసం ఇక్కడే ఉందని ప్రజలను నమ్మబలికాడన్నారు. అధికారంలోకి రాగానే, మాట మార్చేసి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర తీశాడన్నారు.