హైదరాబాద్ జిల్లా: కూకట్పల్లిలో మహిళా హత్య కేసు పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతులు కట్టేసి చంపేయడం ఏంటని ప్రశ్నించారు. సిటీలో లా అండ్ ఆర్డర్ తప్పిందని ఎమ్మెల్యే ఆరోపించారు.హంతకులకు తగిన బుద్ధి చెప్పాలని పోలీసులకు సూచించారు. తమ ప్రభుత్వం లో సిటీ ఇమేజ్ పెరిగిందన్నారు ప్రస్తుతం జరుగుతున్న నేరాలను చూసి హైదరాబాద్ కు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొని ఉందన్నారు.