సంచార జాతులం సదాచార వారసులం సంస్కృతుల వారధులం అనే నినాదంతో బీజేపీ ఈ నెల 30న స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు భీమవరంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్ఫూర్తి కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు. సంచార సమాజాన్ని స్ఫూర్తి ప్రధాతలుగా తెలుపుతూ స్ఫూర్తి కార్యక్రమమని ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ అన్నారు.