మాగునూరు మండలంలోని తలంకేరి ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి గాయత్రి గురుకుల పాఠశాలలో సీటు సాధించినందుకు గ్రామస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మండల నోడల్ ఆఫీసర్ వెంకటయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి గాయత్రి ని సన్మానించారు.