వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ వినాయకచవితి పండుగ సందర్బంగా పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ విజ్ఞేశ్వర స్వామి వల్ల విజ్ఞాలు తొలగుతాయని అందరి అభివృద్ధిలో విజ్ఞేశ్వరుడు తోడుగా వుండాలి అన్ని అన్నారు. దేవుడి అనుగ్రహంతో పాటు మనం చేసే కర్మ పనులు కూడా బాగుండాలని అన్నారు.