సంబేపల్లి మండలం పి.పాపన్నగారిపల్లిలో కుటుంబ కలహాలు ఉద్రిక్తతకు దారితీశాయి. గతేడాది నవంబరులో అన్నప్పగారిపల్లికి చెందిన కళ్యాణి, అదే మండలం పాపన్నగారిపల్లికి చెందిన యాదగిరితో వివాహం జరిగింది. అయితే, రెండు నెలల క్రితం అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భర్త యాదగిరి తనను పుట్టింటికి పంపించాడని కళ్యాణి ఆరోపించింది.దీంతో న్యాయం కోసం కళ్యాణి తన తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటి ఎదుట మూడురోజులుగా ధర్నా చేస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.