పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎస్సై బాలకృష్ణ మీడియాతో మాట్లాడటం జరిగింది. బొల్లాపల్లి మండల పరిధిలో వినాయక చవితి మండపాల వద్ద గొడవలు పడకుండా భక్తిశ్రద్ధలతో ప్రజలందరూ వినాయక చవితిని జరుపుకోవాలని అన్నారు. అలానే వినాయక నిమజ్జనం లో డీ జే లు బాణాసంచాలు పెట్టకుండా గొడవలు పడకుండా నిమజ్జనం జరుపుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు జరిగిన పోలీసుల వారికి తెలియపరచాలని అన్నారు.