శుక్రవారం రాత్రి 8:30 సమయంలో నెల్లూరు రైల్వే స్టేషన్లోని తూర్పు బుకింగ్ కౌంటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు అలపై నుంచి 40 సంవత్సరాల కలిగిన సదరు వ్యక్తి సహజ మరణం పొందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఆఫ్ కలర్ టీ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని.. అతని వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రైల్వే ఎస్సై హరిచంద్ర కోరారు.