అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగం తమ పంటల పండించేందుకు పెద్ద ఎత్తున యూరియా కోసం వేచి చూస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. తమకు యూరియాను అందించి పంటల సాగుకు సహకరించాలని కోరుతున్నారు.