నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో ఏర్పాటుచేసిన శ్రీ శివశక్తి గణేష్ మండలి వద్ద డిపో మేనేజర్ పండరి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి తనయుడి ఆశీస్సులతో నిర్మల్ డిపో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సీఐ దేవపాల, ఎంఎఫ్ నవీన్ కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.