జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో నేర్పించిన విద్యా బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఖాళీ సమయంలో చక్కగా చదువుకోవాలని సూచించారు.