అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ బేతంచెర్లలోని సీఐటీయూ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, మండల కార్యదర్శి నాగలక్ష్మి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 42 రోజుల చారిత్రాత్మక సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని మినిట్స్ కాపీ ఇచ్చారు తప్ప.. ఆచరణలో అమలు చేయలేదని గుర్తు చేశారు.