దివ్యాంగ పెన్షన్ల తొలగింపు దుర్మార్గం: వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం దుర్మార్గమని వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు అన్నారు. సోమవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల JAC ఆధ్వర్యంలో జరిగిన ధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులకు అన్యాయం చేస్తే కూటమి కోటకు బీటలు వారుతాయని హెచ్చరించారు. రీ వెరిఫికేషన్పై పునరాలోచన చేయాలన్నారు. తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.