యాదాద్రి భువనగిరి జిల్లా: బునాదిగాని కాల్వ భూసేకరణకు సంబంధించిన రైతుల పరిహారంగా 16 కోట్లు 70 లక్షలు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మాటల వద్ద ఆగిపోయిన కాలువ తవ్వకాన్ని పరిశీలించ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ బునాది గాని కాల్వ మొత్తం 98 కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేయబడుతూ 14 ఎకరాల ఆయకట్టు కలిగిన సుమారు 6000 చెరువులు నిండుతాయని 20500 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.