కడప జిల్లా కమలాపురం పంచాయతీ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడు తీవ్ర గాయాలతో ఉన్నట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. శనివారం గత రాత్రి రైలు కింద పడిన యువకుడు వయసు 15 సం..18, సం... మధ్య వయసు గల యువకుడు నలుపు రంగు తెల్లని సారలు గల షర్టు, బిస్కెట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నారన్నారు. గాయలతో వున్న యువకుని వైద్య సహాయం కోసం కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకునికి సంబంధించిన సమాచారం తెలియలేదని పోలీసులు తెలిపారు పై ఫోటో గల యువకునికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కమలాపురం పోలీసులను సంప్రదించాలని వారు తెలియజేశారు.