ములుగు (మం) మాధవరావు పల్లి లో ఆత్మహత్య చేసుకున్న పారిశుద్ధ కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి విరాళాల ద్వారా సేకరించిన రూ.101116/- లను బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి నేడు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిక్షాటన మా యొక్క ఉద్దేశం కాదు, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే చేశామని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తామని అన్నారు.