గత కెసిఆర్ ప్రభుత్వ పాలనలో మానుకోట జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్ - ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మానుకోట జిల్లా అవినీతిలో నెంబర్ వన్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ లో పర్యటించిన మాజీ మంత్రి డోర్నకల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మీడియా తో మాట్లాడుతూ.యూరియా కొరతతో ప్రజలు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్ల మీదికి వచ్చే ధర్నాలు,నిరసన వ్యక్తం చేసే పరిస్థితి దాపురించిందంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని,రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడుతుంటే,ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విహారయాత్రల పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని అన్నారు.