విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన కంటు పైడిరాజు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. డీఎస్సీ ఫలితాల్లో 47వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తల్లిదండ్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు.. ఇంత వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు, భార్య తనను పెంచి పోషించారని.. వాళ్ల కృషి.. నమ్ముకున్న ఏసుప్రభువు ఆశీస్సులతో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపిక అయ్యానని తెలిపారు.