జమ్మికుంట: పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి భాధ్యతగా భావించాలన్నారు ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ తో తయారు చేసే విగ్రహలు నీటిలో కరగడానికి సంవత్సరాలు పడుతుందని అన్నారు. మట్టి తో తయారు చేసే విగ్రహాలు నీటిలో త్వరగా కరుగుతాయన్నారు. మట్టి గణపతులను వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజిరెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.