ఎన్డీఏ కూటమి అగ్ర నాయకులు జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గజగజ వణుకుతున్నారని ఏపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల అన్నారు. గురువారం రాత్రి కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో జరిగిన వినాయక చవితి పండుగ వేడుకలలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి వివరించి మళ్ళీ జగనన్నను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ జగనన్న ఎవరో తెలియదన్నాడని ఆయనకు జగన్ ఎవరో తెలిసేలా చేస్తామన్నారు.