ఆదోని మండలం హనువాళ్లు గ్రామానికి చెందిన దుగ్యాప్పా పేదరికాన్ని జయించి టీచర్ ఉద్యోగం సాధించారు. రోజూ పొరకలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ చదువు కొనసాగించారు. తాజాగా విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో 64.71706 మార్కులతో సాధించి ఎస్టీ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించాడు. తన కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన దుగ్యాప్పాను పలువురు అభినందించారు.