తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని.. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాన్ఫెరెన్స్ హల్ లో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ బెన్ష లోమ్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి అని అన్నారు.