నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన రైతు రామనాథ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 24న కేసీ కెనాల్లో దూకగా.. రాళ్ల కొత్తూరు వద్ద మృతదేహం మంగళవారం లభ్యమైందన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.