అత్త తన కోడలిని అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి తోసేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడిన కోడలిని మొదట ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ఏలూరు, తరువాత విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భర్త తమిళనాడులో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటలకు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.