జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని కొండాపూర్ గ్రామ పరిధిలోని పెద్ద తండాలో బాధవత్ లక్ష్మీ అనే మహిళ తన ఇంట్లో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.వ్యవసాయ కూలీల జీవనం సాగిస్తున్న లక్ష్మీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.