బెజ్జూరు మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని యువకులు కోరారు. శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం ఇది చాలా అవసరమని మండల కేంద్రంలో అణువైన స్థలాన్ని గుర్తించి ఆధునిక వ్యాయామ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఓపెన్ జిమ్ యువకులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అవసరమని దీని ఏర్పాటుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు,